ఆపదలో చేయూత… సీఎం సహాయనిధి: నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

TEJA NEWS

ఆపదలో చేయూత… సీఎం సహాయనిధి: నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిజాంపేట్ సిహెచ్. శ్రీనివాసా రావు గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుటకు ఆర్ధిక స్థోమత లేదు అని తెలుసుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా బాధితుడికి శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 2,50,000/- ల సీఎం సహాయనిధి – ఎల్వోసీ ని మంజూరి చేయించారు. రూ 2,50,000/- (రెండు లక్షల యాభై వెల రూపాయలు ) CMRF – LOC మంజూరి పత్రాలను శ్రీనివాసా రావు కి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జక్కుల మల్లేష్ యాదవ్, దూసకంటి పద్మ రావు, గోపాల్ యాదవ్, సంజీవ రెడ్డి, అంజాద్, నర్సింగ్ రావు, ఎండీ . షకీల్ ఉద్దీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top