మైపాడు రోడ్డుకి మరమ్మత్తులు త్వరలోనే ప్రారంభిస్తాం
పార్టీ కోసం కష్టపడ ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ముదివర్తి పాళెం దశాబ్దాల నాటి కలగా మిగిలిన ముదివర్తి – ముదివర్తి పాళెం కాజ్ వే నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇందుకూరుపేట మండలం ముదివర్తి పాళెం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గ్రామస్థులు ఆత్మీయ స్వాగతం పలికారు. స్థానిక సచివాలయ సిబ్బంది, టిడిపి నాయకులతో కలిసి ఆమె ముదివర్తి పాళెం మిక్సెడ్ కాలనీలో ఇంటింటికెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్లు అందచేశారు. స్థానిక సమస్యలపై ప్రజల విన్నపాలు ఓపిగ్గా విన్నారు. ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలు తీరు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భగంగావారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో అస్తవ్యస్తమైన పాలనా వ్యవస్థను సంస్కరించి ప్రణాళికా బద్ధంగా రాష్టాన్ని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు ముదివర్తి పాళెం కాజ్ వే నిర్మాణం పూర్తయ్యాక ఇందుకూరుపేట మండల వాసులకు వరద ముప్పుతో పాటు ఉప్పునీటి సమస్య వుండదన్నారు.
రాముడు కాలువ పై స్థానికుల విన్నపం పై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పందిస్తూ వరద ముప్పు రాకుండా రాముడు కాలువకు ప్రొటక్షన్ వాల్ నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా నెల్లూరు – మైపాడు రోడ్డు పనులు ఆగిపోయాయన్నారు. సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి మైపాడు రోడ్డు పనులకు గ్రీన్ సిగ్నల్ పొందినట్లు ఆమె వెల్లడించారు.ప్రతి ఒక్కరికి కూడు, గుడ్డ , నీడ కల్పించడమే టిడిపి లక్ష్యమన్నారు.పార్టీ కోసం కష్టపడ ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే దిశగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట మండల టిడిపి అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, చెంచుకిషోర్ యాదవ్, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీ కృష్ణా రెడ్డి, నాగరాజు, సుబ్రహ్మణ్యం, రాజారెడ్డి, చిల్లకూరు రాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
