బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కెపి వివేకానంద్ చేతులమీదుగా శ్రీ వెంకటేశ్వర జనరల్ మెడికల్ స్టోర్ ప్రారంభం…
127 – రంగారెడ్డి నగర్ డివిజన్ నెహ్రు నగర్ ఆస్బెస్టాస్ కమాన్ వద్ద సిహెచ్. భూపతి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర జనరిక్ మెడికల్ స్టోర్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పేదలు అధికంగా నివసించే జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఏర్పాటు చేసిన మెడికల్ షాప్ వినియోగదారులకు చౌక ధరలో మందులను అందించి దినదినాభివృద్ధి చెందాలన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, సీనియర్ నాయకురాలు తారక రాణి, సీనియర్ నాయకులు సుధాకర్, సాబేర్, క్రాంతి యాదవ్, జల్దా లక్ష్మీనాథ్, కార్తీక్ గౌడ్, బాలు నేత, ఎర్వ సాయికిరణ్, టీంకు గౌడ్, కరుణా , మేరీ, అల్లావుద్దీన్, గిరి, ఆశం తదితరులు పాల్గొన్నారు.
