200 కోట్ల బడ్జెట్తో 30 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్

TEJA NEWS

200 కోట్ల బడ్జెట్తో 30 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు కావడం సంతోషంగా ఉంది – ఎమ్మెల్యే మురళీ నాయక్
మహబూబాబాద్ నియోజకవర్గం : మహబూబాబాద్ పట్టణ కేంద్రం లో ఉన్న ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజలను పర్యటించిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్

మహబూబాబాద్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం జరిగింది

పోరాటాల గడ్డ మానుకోట పై ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరాం

ఇక్కడ బాలికల పాఠశాల తో పాటు,జూనియర్ కలశాల మరియు బాలుర పాఠశాల తో పాటు,జూనియర్ కలశాల మొత్తంగా కలిపి ఇంటిగ్రేటెడ్ గా ఏర్పాటు చేయాలి…..

అంతేకాకుండా కాంపిటేషన్ అంటూ పోటీ ప్రపంచంలో ఉన్న నేపథ్యంలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు

మన ప్రభుత్వం అలా కాకుండా పాఠశాల స్థాయిలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు

తక్షణ నిధుల కింద 40 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు

2003 లో స్థానిక శాసన సభ సభ్యుడిగా వేం నరేందర్ ప్రస్తుతం ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులు ఆయనకు వివరించగానే భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నిధుల మంజూరు కావడానికి ప్రత్యేక చొరవ చూపించారు

బాలికల పాఠశాల తో పాటు,జూనియర్ కలశాల మరియు బాలుర పాఠశాల తో పాటు,జూనియర్ కలశాల ఏర్పాటు చేయాలి అని నిర్ణయించము

చాలా వరకు 5 వ తరగతి ముగిసిన తర్వాత వేరే ప్రాంతానికీ వెళ్ళలేక ,తల్లితండ్రులు కూలీలు అయిన నేపథ్యంలో డ్రాప్ ఔట్ శాతం 20% వరకు ఉంది అని అనేక నివేదికలో చూశాం

అలా జరగకుండా ఎడ్యుకేషన్ తో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో ఇక్కడ పాఠశాల ఏర్పాటు చేయబోతున్నాం

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పట్టణ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top