హనుమంతునిపై ప్రసన్న వేంకటేశ్వరుడు
** గరుడ వాహన సేవలో తరించిన భక్తజనం
తిరుపతి: తిరుపతికి 20కి.మీల దూరంలోని అప్పలాయగుంటలో కొలువుదీరిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు హనుమంత వాహనంపై శ్రీ రామావతారం అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 08 గంటలకు హనుమంత వాహనసేవ ప్రారంభమైంది. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి స్వామివారు అత్యంత ఇష్టమైన గరుడ వాహనం పై విహరించి కటాక్షించారు. ఈ సేవలో భక్తులు పోటెత్తి…. అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3 – 4 గం.ల మధ్య పుణ్యహం, వసంతోత్సవం నిర్వహించారు. రాత్రి 7 గం.లకు గజ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించారు.
వాహన సేవలో టీటీడీ డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.
