స్విమ్స్ లో అంతర్జాతీయ యోగా వారోత్సవాలు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతిలోని శ్రీ వేంకట్వేర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) మెడికల్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా వారోత్సవాలు జరిగాయి. సిద్ద క్లినికల్ రీసెర్చ్ యూనిట్ తిరుపతి వారి సహకారంతో శ్రీ పద్మావతి ఆడిటోరియంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సెమినార్ నిర్వహించారు. ఇందులో స్విమ్స్ డైరెక్టర్ డా. ఆర్.వి.కుమార్, కార్డియాలజీ సీనియర్ ప్రొఫెసర్ డా. వనజాక్షమ్మ, ఫిజియాలజి ప్రొఫెసర్ డా.శర్వాణి, నెఫ్రాలజీ సీనియర్ ప్రొఫెసర్ డా.శివ కుమార్, ఫిజియోథెరపి ప్రిన్సిపాల్ మాధవి, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ సుధారాణి, సిద్ధ క్లినికల్ రీసెర్చ్ యూనిట్ ఇన్చార్జ్ సామ్రాజ్, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎర్రమరెడ్డి, డిపార్ట్మెంట్ ఆఫ్ సంఖ్యాయోగ నేషనల్ సంస్కృత యూనివర్శిటి అసోసియేట్ డి.జ్యోతి, కౌన్సిలింగ్ సైకాలజిస్టు ఐఐటి, తిరుపతి సి.ఇ.ఓ. మనోభవ సైకాలజీ ఇన్సిస్టిట్యూట్ నీరజ సంయుక్తంగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విమ్స్ డైరెక్టర్ ఆర్.వి. కుమార్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ యోగా సాధన దైనందిన జీవితంలో అలవర్చుకోవడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని జయించి ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. యోగా ఆరోగ్యానికి దివ్యౌషదమని ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగాసనాలు ఎంతగానో ఉపయోగ పడుతాయన్నారు.
కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్, కార్డియాలజీ సీనియర్ ప్రొఫెసర్ డా. వనజాక్షమ్మ మాట్లాడుతూ యోగాలో ముఖ్యమైన ఆసనము సూర్యనమస్కారమని, ఈ ఆసనం ద్వారా 12 రకాల ఆసనాల కలయికగా వుంటుందని, దీనిని చేయడం వల్ల చాలా వరకు మనసుకు, శరీరంకు ప్రశాంతత వుంటుందని తెలిపారు. ఫిజియాలజీ ప్రొఫెసర్ డా.శర్వాణి సైకాలజీ ఆఫ్ యోగా అనే అంశంపై మాట్లాడుతూ*… యోగ ద్వారా శారీరక ప్రభావాలను తగ్గించుకోవచ్చునని, వివిధ యోగాసనాలు, ప్రాణయామం ద్వారా కణజాలం, నాడీ, శ్వాసకోశ, హృదయనాళ వ్యవస్థలతో సహా శరీర వ్యవస్థలను సానుకూలంగా ప్రభావితంచేస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు, ఆర్ఎంఓ డాక్టర్ వెంకట కోటిరెడ్డి, పీఆర్వో డీడీ రాజశేఖర్, సిబ్బంది అమర్, సుబ్రహ్మణ్యం రెడ్డి, గణేష్, సుందర్, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల, ఫిజియోథెరపి, నర్సింగ్, ఆల్టైడ్ హెల్త్ సైన్సెస్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
