స్విమ్స్ లో ప్రాజెక్టు పోస్టులకు ఇంటర్వ్యూలు

WhatsApp Image 2026 02 14 at 6.24.06 PM
TEJA NEWS

స్విమ్స్ లో ప్రాజెక్టు పోస్టులకు ఇంటర్వ్యూలు

** ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు వాక్ ఇన్

తిరుపతి: శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో “ఎవల్యూషన్ ఆఫ్ క్యాన్సర్ అవేర్‌నెస్ అండ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ – యాన్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్‌” అనే ఎం.ఆర్.సి ప్రాజెక్టు లో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ ప‌లు పోస్టుల కోసం ఈనెల 19 నుంచి 23వ తేది వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు స్విమ్స్ మెడికల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.అపర్ణ ఆర్ బిట్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

పోస్టుల వివరాలు ఇలా…

  1. మెడికల్ ఆఫీసర్ – 4
  2. స్టాఫ్ నర్సు – 4
  3. ఎ.ఎన్.ఎం – 4
  4. మామోగ్రఫీ టెక్నీషియన్ – 2
  5. కార్డియోవాస్క్యులర్ టెక్నీషియన్ గ్రేడ్-II – 2
  6. డేటా ఎంట్రీ ఆపరేటర్ – 2
  7. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ – 2
  8. మెడికో సోషల్ వర్కర్ -2
  9. ఎలక్ట్రీషియన్ – 2
  10. డ్రైవర్ – 2 నోటిఫికేషన్, దరఖాస్తు ఫారం, ఇతర వివరాల కోసం స్విమ్స్ వెబ్‌సైట్ ను సంప్రదించాలి.

You cannot copy content of this page