రోడ్డుమీద రోడ్డు వేయాలనుకోవడం అవివేకం, అశాస్త్రియం

TEJA NEWS

రోడ్డుమీద రోడ్డు వేయాలనుకోవడం అవివేకం, అశాస్త్రియం.
సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

మక్దుమ్ నగర్ నుండి సీసల బస్తి వెళ్లే దారి నూతనంగా సిసి రోడ్డు వేయడానికి కాంట్రాక్టర్ వారం రోజుల క్రితం రోడ్డును జెసిబి తో తోవి వదిలేయడం వల్ల ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని తెలుసుకొని నేడు సిపిఐ బృందం ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించడం జరిగింది.
ఈ సందర్భంగా స్థానికులు సిపిఐ నాయకత్వంతో మాట్లాడుతూ వారం రోజుల కింద తవ్వి అలాగే వదిలేశారని, తవ్వినప్పుడు డ్రైనేజ్ మూతలు పగలడం వల్ల డ్రైనేజ్ పొంగిపొర్లుతుందని ఈ విషయం తెలిసినప్పటికీ అటు కాంట్రాక్టర్ ఇటు అధికారులు కనీస చర్యలు తీసుకోలేదని, అలాగే రోడ్డుపైనే మరో రోడ్డు వేయడం అధికారుల అలసత్వానికి నిదర్శనం అని అన్నారు.
ఇదే విషయాన్ని ఏ ఈ తిరుపతి గారితో సిపిఐ కార్యదర్శి ఉమామహేష్ మాట్లాడగా మాకు డిపిఆర్ అలాగే ఉన్నది మేము అలాగే వేస్తామని చెప్పడం ఒక అధికారి నిర్లక్ష్యం తెలియజేస్తుందని, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం తగదని కేవలం కాసుల కక్కుర్తి పడకుండా ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శిలు హరినాథ్ రావు, రాములు, కార్యవర్గ సభ్యులు వి శ్రీనివాస్, సదానంద్, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు,స్థానికులు వంశీ, విష్ణు, రామ్ రెడ్డి, సిపిఐ నాయకులు సాయిలు, ఇమామ్, రవి, సామెల్, ప్రభాకర్ మరియు బస్తివాసులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top