ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
వినుకొండ పట్టణం 26వ వార్డులోని కట్ట కింద బజార్ నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను పంపిణీ చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. జీవి మాట్లాడుతూ, పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కూటమి నాయకులు, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, అధికారులు, పాల్గొన్నారు.
