ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు, అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో దుస్తుల పంపిణీ చేసి మహబూబ్నగర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు, ఈ సందర్భంగా కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ, కొన్ని వేలాదిమంది అమరులు ప్రాణత్యాగం చేస్తే గాని భారతదేశానికి స్వతంత్రం రాలేదు, అదేవిధంగా ఎవరు అవునన్నా కాదన్నా ఇదే సత్యం, సోనియాగాంధీ మంచి మనసుతో ఇవ్వాలని పట్టుబట్టి తెలంగాణ తీసుకొచ్చిందన్నారు, నీళ్లు నిధులు నియామకాలు 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా నియమించబడ్డాయి, నిధులు కూడా పూర్తిగా ఉన్నాయి మంత్రులు అంతా కూడా పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నారు అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు, కల్వకుర్తిలో రహదారి రోడ్ల కోసం ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయబడ్డాయి, అంతే కాకుండా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 50 కోట్లతో సిసి రోడ్లు డ్రైనేజీలు అన్ని విధాలుగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి, భూపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ సంజీవ్ యాదవ్, పొల్యూషన్ మెంబర్ ఠాగూర్ బాలాజీ సింగ్, మున్సిపాలిటీ కమిషనర్ మహమ్మద్ షేక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
