
- మైనర్ బాలికకు అన్యాయం జరిగిందని అడిగితే అక్రమ కేసులు, ఎమ్మెల్యే ప్రోద్బలం తోనే అర్ధరాత్రి అరెస్టులు…..బిఆర్ఎస్ నాయకుల ఆగ్రహం అరెస్టయినావారిని బేషరతుగా వదిలిపెట్టాలని స్టేషన్ ముట్టడి , కోర్టుకు తరలింపు బెయిల్ పై విడుదల
అరెస్టు అయిన నాయకులను పరామర్శించిన మాజీమంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి
మైనర్ బాలికపై లైంగిక దాడి సంఘటనను జిల్లా కేంద్రంలోని అక్షరపాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన నాయకులపై ఎమ్మెల్యే మెగా రెడ్డి ప్రోద్బలంతో అక్రమ కేసులు బనాయించి దొంగలను అంతకుల ను అరెస్టు చేసినట్లు అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఇండ్ల వద్దకు వచ్చి నందిమల్ల అశోక్ మెకానిక్ శీను చీర్ల చందర్ తో పాటు మరో ఆరుగురిని పోలీసులుఅరెస్టు చేసి స్టేషన్కు తరలించడం దారుణమని వారి అరెస్టుల ను నిరసిస్తూ రాజకీయ విద్యార్థి మహిళా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం వనపర్తి పట్టణపోలీస్ స్టేషన్ను దాదాపుగా నాలుగు గంటల పాటు ముట్టడించి తమ నాయకులను” భే”‘ శరత్తుగా స్టేషన్ బెయిల్ ద్వారా వదిలి పెట్టాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ చైర్మన్ పలుసా రమేష్ గౌడ్ బిజెపి నాయకులు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడుతూ ఈమధ్య ఎమ్మెల్యే అవినీతి బాగోతాన్ని బయటపెడుతున్నామన్న అక్కసుతో రాజకీయ కక్షతో స్కూల్ యాజమాని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే బంధువుకావడంతో వారిని కాపాడేందుకే మెగా రెడ్డి ఈ భారీ కుట్రని అందులో భాగంగానే తమ నాయకుల అరెస్టులు అని ఆరోపించారు
అసలు సంఘటన వివరాలు తెలుసుకోకుండానే సంఘటన బాధితులను పరామర్శించకుండానే నేరానికి పాల్పడిన నిందితున్ని యాజమాన్యాన్ని వదిలిపెట్టి తమ వారిని అరెస్టుల పర్వానికి తెర తీయడం దారుణమని దుయ్యబట్టారు ఎమ్మెల్యే కనుసన్నలలో ఆయన ఆజ్ఞల మేరకే అతి ఉత్సాహంతో పోలీసులు పనిచేస్తున్నారని వనపర్తి డిఎస్పి సునీత రెడ్డికి మంచి పేరు ఉందని ఇలాంటి అతి ఉత్సాహం తో పనిచేసే వారి ని కట్టడి చేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీని నాయకులు కోరారు బాధితమైనర్ బాలిక కుటుంబానికి న్యాయం జరగాలా చూడాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించాలి
అక్రమఅరెస్టు ల విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకొని అరెస్టు కాబడిన నందిమల్ల అశోక్ మెకానిక్ శీను చీర్ల చందర్ మైనార్టీ నాయకులను పరామర్శించారు మాజీ మంత్రి లాయర్ కావడంతో భయపడాల్సినది ఏమీ లేదని బెయిల్ వస్తుందనినాయకులకు ధైర్యం చెప్పారు అరెస్టు చేయబడిన 9 మందిలో 8 మందిని వనపర్తిమెజిస్ట్రేట్ వద్ద హాజరు పరచగా కోర్టుబెయిల్ మంజూరు చేసినట్లు మిగిలిన ఒకరు చీర్ల చందర్ స్టేషన్ పై విడుదల చేసినట్లు నాయకులు తెలిపారు సంఘటనకు పాల్పడిన అనుమానితుని స్కూల్ యజమాని ని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాజశేఖర్ గౌడ్ పెద్దిరాజు కాగితాల లక్ష్మీనారాయణ మంగళం తిరుమల్ కౌన్సిలర్లు మురళి సాగర్ శ్రీకర్ గౌడ్ సమద్ సార్ రహీం ధర్మానాయక్ హేమంత్ జోహార్ హుస్సేన్ సూర్యవంశం గిరి యుగంధర్ రెడ్డి చిట్యాల రాము సిపిఎం నాయకులు పరమేశ్వర ఆచారి సిపిఐ నాయకులు గోపాలకృష్ణ రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు