జయ నగర్ కాలనీ వరద నీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తాం – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

TEJA NEWS

జయ నగర్ కాలనీ వరద నీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తాం – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి ప్రధాన రహదారి గోవింద్ హోటల్ చౌరస్తా నుండి జయ నగర్ కాలనీ వరకు డ్రైనేజీ నీరు పొంగి రోడ్ల మీద ప్రవహిస్తుందని కాలనీ వాసులు సమస్యను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ జయ నగర్ కాలనీ కి వెళ్లి సమస్యను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సమస్యను శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఏ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ కి మరియు జల మండలి అధికారులకు వివరించామని వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరిస్తామని అన్నారని తెలిపారు. ఇప్పుడు సమస్య ఉన్న గల్లీ కి డ్రైనేజీ లైన్ మంజూరై ఉంది కాబట్టి త్వరలో నూతన డ్రైనేజీ లైన్ నిర్మించి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.

ప్రదానరహదారి కావడంతో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ నిలిచిపోకుండా వరదనీటిని క్లియర్ చేయడం జరుగుతుందని అన్నారు. అకాల వర్షాలతోఎటువంటి ఇబ్బందులు కలిగిన,(ఎలక్ట్రికల్, రోడ్డు, డ్రైనేజీ, మంచి నీటి) వంటి సమస్య లు ఎదురైన, వెంటనే సంబంధిత అధికారులకు గాని, మాకు గాని, మా కార్యాలయంకు గాని సంప్రదించాలని తెలియచేసారు. అదేవిధంగా వర్షాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని , GHMC అధికారులు మరియు మాన్ సున్ ఎమర్జెన్సీ టీమ్స్ , డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండ చూడలని తెలియచేసారు.

You cannot copy content of this page

Scroll to Top