మూడు సార్లు గెలిచాడు, ముప్పై చెరువు, కుంటలని కబ్జా చేశాడు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అని మండిపడ్డారు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కోలన్ హనుమంత్ రెడ్డి.
సూరారం లోని పలు కాలనీల్లో బోరు బావులు ఎండి పోయి తీవ్ర నీటి కొరత ఏర్పడింది అంటూ కాలని వాసులు కొందరు రెడ్డిని కలిసి సమస్యను విన్నవించుకోగా… ఇవ్వాల కాలనీల్లో పర్యటించిన ఆయన స్థానికంగా ఉన్న నీటి కుంటను కబ్జా చేయడం వల్లనే నీటి కొరత ఏర్పడింది అన్నారు.
సర్వే నెంబర్.21లో ఉన్న కొత్త కుంట చెరువు ను కొందరు బి ఆర్ ఎస్ నాయకులు మట్టి పోసి,పూడ్చి చెరువును కబ్జాలు చేస్తున్నారని రూములు నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోనీ పలు చెరువు లను స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కబ్జాలు చేసి,ఆక్రమలకు పాల్పడ్డారని, వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక, చెరువులు, ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు ప్రభుత్వం హైడ్రా ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.
కొత్త కుంట చెరువును ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తామని,ఆక్రమణకు గురైన చెరువులను పునర్మించే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
బైట్:కోలన్ హనుమంత్ రెడ్డి(కుత్బుల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పాల కృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోల్ల సంజీవ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు సంతోష్ ముదిరాజ్, 130 డివిజన్ అధ్యక్షులు సోమన్న గారి శ్రీధర్ రెడ్డి మరియు , శ్రీ రామ్ నగర్ మరియు కృష్ణ నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.
