ఘనంగా జరిగిన కనకం కుటుంబం ఆత్మీయ సమ్మేళనం…..

TEJA NEWS

ఘనంగా జరిగిన కనకం కుటుంబం ఆత్మీయ సమ్మేళనం…..

పెద్దపల్లి//కరీంనగర్: ఇటీవల కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్ రోడ్ లో గల కృషి ఫంక్షన్ హాల్ లో “కనకం కుటుంబం ఆత్మ సమ్మేళనం” కార్యక్రమాన్ని కనకం కుటుంబ సభ్యులంతా కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు.

కార్యక్రమంలో ముందుగా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్,జగ్జీవన్ రామ్ ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

కనకం కుటుంబం వ్యవస్థాపకులు కనకం రమణయ్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నారు. మరణించిన కమిటీ మెంబర్ కనకం వెల్ఫేర్ సొసైటీ కోశాధికారి కనకం విజయ్ తోపాటు అమరులైన కనకం కుటుంబ సభ్యులకు రెండు నిమిషాలు మౌనం పాటించి జోహార్లు అర్పించినారు.

అనంతరం వివిధ జిల్లాలు గ్రామాల నుండి వచ్చిన కనకం కుటుంబ సభ్యుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించినారు.
కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కనకం కుటుంబానికి, సంబంధించిన మహిళామణులచే కేక్ కట్ చేయించి సంబరాలను జరుపుకున్నారు.

భోజనాల అనంతరం కనకం కుటుంబం నుండి వివిధ రంగాలలో సేవ చేస్తున్న కనకం కుటుంబ సభ్యులను కనకం గోల్డెన్ స్టార్ పురస్కార్ 2026 లతో ఘనంగా సన్మానించినారు.
అలాగే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులను కనకం ఆడబిడ్డలను కూడా కనకం ఆత్మీయ జ్ఞాపిక లతో సన్మానించినారు.

భవిష్యత్తులో కనకం వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి విరాళాల సేకరణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు మొదలగు వాటి గురించి వక్తలు పలు సూచనలు చేసినారు.

ముఖ్యఅతిథిగా హాజరైన కనకం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు కనకం రమణయ్య మాట్లాడుతూ.. 2002వ సంవత్సరం నుండి కనకం సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకొని, కుటుంబ సభ్యుల నుండి ప్రతినెల సేకరించిన విరాళాల ద్వారా కనకం కుటుంబంలోని నిరుపేదలకు, వృద్ధులకు, బాలికలకు, విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నామని, భవిష్యత్తులో కూడా అందరం కలిసి మెలిసి కుటుంబాల ఐక్యతను పెంపొందించుకొని, సేవా తత్వంతో పేరును సమాజంలో సార్థకతను చేయాలని మన కుటుంబ సభ్యులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, కష్టపడుతూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతూ కుటుంబ సేవలోనూ సమాజసేవలోను ముందుండాలని ఆకాంక్షించినారు.

ఈ యొక్క సమ్మేళనంలో కనకం కుటుంబానికి సంబంధించిన 200 మంది వరకు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కవి, రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కనకం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కనకం సమ్మయ్య, సహాయ కార్యదర్శి కనకం శంకర్ బాబు, కార్యదర్శి కనకం తిరుపతి, కనకం సుధాకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కనకం నాగరాజు, కమిటీ సభ్యులు కనకం అవినాష్, కనకం అనిల్, కనకం విద్యాసాగర్, కనకం వంశీ, కనకం అశోక్ లతోపాటు సలహాదారులు కనకం కనకయ్య,కనకం దేవస్వామి, కనకం సారయ్య, కనకం దేవరాజ్, కనకం సురేష్, కనకం సంపత్, కనకం సామ్సన్, అరిస్టాటిల్ రామ్ కుమార్, సినీ నటుడు కనకం వెంకట్, టిఆర్ఎస్ నాయకులు కనకం తిరుపతి, మహిళా మణులు కనకం రాజేశ్వరి, కనకం సుశీల, కనకం తిరుమల, కనకం స్నేహలత, కనకం లక్ష్మి, కనకం సునీత, కనకం రాధిక,కనకం సౌజన్య, కనకం విమల,కనకం శ్వేత, కనకం వినోద మొదలగువారు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top