కొల్లాపూర్ పట్టణ అభివృద్ధికి రూ.18.25 కోట్ల నిధులు మంజూరు
పట్టణ అభివృద్ధికి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవ
కొల్లాపూర్, : కొల్లాపూర్ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.18.25 కోట్ల నిధులను మంజూరు చేసింది. పట్టణ అభివృద్ధికి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పట్టణ సుందరీకరణ, మౌలిక వసతుల కల్పన బలోపేతం, ప్రజా అవసరాల దృష్ట్యా ఈ నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పట్టణంలోని అంబేద్కర్, గాంధీ, అల్లూరి సీతారామరాజు విగ్రహాల జంక్షన్ల అభివృద్ధికి రూ.15 లక్షలు, చుక్కాయిపల్లి మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధికి రూ.6.50 కోట్లు, కొల్లాపూర్ మినీ స్టేడియం అప్‌గ్రేడేషన్‌కు రూ.5.50 కోట్లు, ఖాదర్ పాషా దర్గా అభివృద్ధికి రూ.4.70 కోట్లు, ఆర్డీవో కార్యాలయం వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.1.40 కోట్లు కేటాయిస్తూ పరిపాలపరమైయన అనుమతులు ఇచ్చింది.
స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక కృషితో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆమోదం పొందినట్లు అధికారులు తెలిపారు.
ఈ పనులు పూర్తయితే కొల్లాపూర్ పట్టణంలో మౌలిక వసతులు మెరుగుపడి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. జంక్షన్ల అభివృద్ధి, మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ, స్టేడియం అభివృద్ధి పనులతో కొల్లాపూర్ పట్టణం కొత్త రూపు సంతరించుకోనుంది.
