టిడిపి నేతను పరామర్శించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

TEJA NEWS

టిడిపి నేతను పరామర్శించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

కావలి, : అనారోగ్యంతో బాధపడుతూ కావలి పట్టణంలోని ఉమా చంద్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అక్కిలగుంటను కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందించి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. అక్కిలగుంట త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

You cannot copy content of this page

Scroll to Top