5వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ గా కందుల చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు
కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డుకు బిఆర్ఎస్ కౌన్సిలర్ గా కందుల చంద్రశేఖర్ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు అంతకంటే ముందు పట్టణంలో బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల చంద్రశేఖర్ మాట్లాడుతూ ఐదోవ వార్డు ను అభివృద్ధి , ప్రజలకుసేవ చేసేందుకు ఎన్నికల్లో మీ ముందుకు వస్తున్నానని పెద్ద మనసుతో ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నానై తెలిపారు ఐదోవ వార్డులో అనేక మౌలిక సదుపాయాల విద్యుత్ వీధిదీపాలు, మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ , సీసీరోడ్లు, వార్డు పరిశుభ్రత పరిష్కారానికి అధికారుల సహాయ సహకారాలతో పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐదోవ వార్డు టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
