కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో వేమిరెడ్డి దంపతుల భేటీ

TEJA NEWS

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో వేమిరెడ్డి దంపతుల భేటీ

నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఢిల్లీలోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్ర హోం మంత్రి అమీత్ షా గారిని కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి.. వేమిరెడ్డి దంపతులను ఆప్యాయంగా పలకరించారు. పెన్నా నది కరకట్టల బలోపేతం మరియు చారిత్రక పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ పరిరక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక అందచేశారు. 2021 నవంబర్ నెలలో సోమశిల జలాశయం నుండి వరద నీరు పెన్నా నదిలోనికి విడుదల చేయడంతో కోవూరు నియోజకవర్గంలోని పెన్నా పొర్లు కట్టలు తెగిపోయి , బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, ఇందుకూరుపేట, విడవలూరు మండలాలు పూర్తిగా జలమయమయమై జనజీవనం స్తంభించిపోయిన సంఘటనలను వేమిరెడ్డి దంపతులు హోం మంత్రి అమిత్ షాకు వివరించారు.

You cannot copy content of this page

Scroll to Top