జనవరి 7న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన

TEJA NEWS

జనవరి 7న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన

సర్పంచ్ ఎన్నికలలో గెలుపొందిన వారికి సన్మాన కార్యక్రమం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనవరి 7న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించానున్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్లకు జరిగే సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా కొత్తగూడెం చేరుకుంటారు. ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఖమ్మంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. రెండు జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఓడిపోయిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.

You cannot copy content of this page

Scroll to Top