ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన :ఎమ్మెల్యే జారే

TEJA NEWS

ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన :ఎమ్మెల్యే జారే

శాంతియుత వాతావరణం లో కొత్త సంవత్సరాన్ని స్వాగతించాలి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం గండుగులపల్లి ,2026 నూతన ఆంగ్ల సంవత్సరం మరో రెండు రోజుల్లో రానున్న నేపథ్యంలో అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యులు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉల్లాసంగా జరుపుకోవాలని కోరారు.

అదే సమయంలో డిసెంబర్ 31 రాత్రి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం రహదారులపై అల్లరి అనవసరమైన గొడవలు శబ్ద కాలుష్యం కలిగించే కార్యకలాపాలు నిర్వహించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రజల భద్రతే ప్రభుత్వ లక్ష్యమని పోలీసు శాఖకు సహకరించి శాంతియుత వాతావరణంలో కొత్త సంవత్సరాన్ని స్వాగతించాలని కోరారు. నియోజకవర్గ ప్రజలందరికీ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

You cannot copy content of this page

Scroll to Top