జొప్లా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సందర్శించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
హైదరాబాద్ మల్లాపూర్ జొప్లా ఎంప్లాయిస్ యూనియన్ సభ్యుల విన్నపం మేరకు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,కార్మిక యూనియన్ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్ జొప్లా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని సందర్శించి ఎంప్లాయిస్ యూనియన్ సమస్యలపై కంపెనీ ఎండీ తో మాట్లాడడం జరిగింది..
అనంతరం కూన శ్రీశైలం గౌడ్ కార్మికులతో కలిసి INTUC జెండాను ఆవిష్కరించారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..
జొప్లా ఎంప్లాయిస్ యూనియన్ అగ్రిమెంట్, ఎంప్లాయిస్ ఇంక్రిమెంట్ వాటిపై కంపెనీ ఎండీ శ్రీనివాస్ తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు..
కార్మికుల, కర్షకుల సమస్యలపై నిరంతరం పోరాడుతు.. కార్మికుల అభివృద్ధికి దోహదపడతానన్నారు..
కార్మికుల యూనియన్ ప్రెసిడెంట్ కూన శ్రీశైలం గౌడ్ ఎల్లప్పుడు మాకు అండగా ఉంటారని జోప్లా ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు..
ఈ కార్యక్రమంలో జోప్లా ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ చంద్రమౌళి గౌడ్, వైస్ ప్రెసిడెంట్ విఎన్ మూర్తి, కె. ప్రవీణ్, ట్రెజరర్ బాలకృష్ణ,జాయింట్ సెక్రెటరీ బాబు కుమార్ మరియు యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
