స్థానిక సంస్థల ఎన్నికలకు తెదేపా సిద్ధమే
తెదేపా పట్టణ నూతన కమిటీ అధ్యక్షులు కాగితాల లక్ష్మయ్యకు నియామక పత్రం అందజేసిన…………….నాగర్కర్నూల్ పార్లమెంట్ కన్వీనర్ బొల మోని రాములు
పట్టణసమస్యలపై స్పందిస్తూ ప్రజల్లో మమేకం అవ్వాలని సూచన
వనపర్తి ; తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇప్పటికే సూచించినట్లు నాగర్ కర్నూల్ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బొలెమోని రాములు పేర్కొన్నారు బుధవారం పార్టీ కార్యాలయంలో తెదేపా కార్యవర్గ సమావేశంలో నూతన పట్టణ కమిటీని ఎన్నుకొని నూతన పట్టణ అధ్యక్షులుగా కాగితాల లక్ష్మయ్య తోపాటు కమిటీ సభ్యుల ను కూడా ప్రకటిస్తూ ఈ మేరకు బొలమోని రాములు
ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కాగితాల లక్ష్మయ్యకు నియామక పత్రాన్ని అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ వనపర్తి పట్టణ మున్సిపాలిటీ పరిధిలో 33 వార్డులలో నెలకొన్న ప్రజా సమస్యలు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు విద్యుత్ దీపాలు మంచినీటి సమస్యలు ఇలాంటి సమస్యలపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని తద్వారా ప్రజల్లో మమేకం అవుతూనే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
తెదేపా పట్టణ నూతన అధ్యక్షులు కాగితాల లక్ష్మయ్య మాట్లాడుతూ పార్టీ సూచనల మేరకు మున్సిపాలిటీ పరిధిలోని 33 వార్డులలో పార్టీ సభ్యులతో కూడుకున్న కొత్త వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే కమిటీ సభ్యులతో కలిసి ప్రజా సమస్యలపై తమ వంతుగా
పోరాడుతామని నూతన పట్టణ అధ్యక్షులు తెలిపారు.
పట్టణనూతన కమిటీ సభ్యులుగా
పట్టణ ఉపాధ్యక్షులుగా పోలేపల్లి బాలయ్య ధ్యారపోగు బాలరాజు ప్రధాన కార్యదర్శులుగా దస్తగిరి పులిజార విశ్వనాథ్ గంధం కృష్ణయ్య ఎం ఫారూఖ్ జి గంధం రాజు కోశాధికారిగా ఏర్పుల చిన్నయ్యలను
ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు హోటల్ బలరాం షాకీర్ హుస్సేన్ బి. శేఖర్ తదితరులు ఉన్నారు.
