డ్రైవర్ ను గుర్తిద్దాం డ్రైవర్ ను గౌరవిద్దాం
ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ నాగశ్రీ..
డ్రైవర్స్ డే సందర్భంగా కోదాడ ఆర్టీసీ డిపో నందు డిపో అసిస్టెంట్ మేనేజర్ నాగశ్రీ డ్రైవర్ సోదరులకు గులాబి పువ్వులను అందజేసి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేనేజర్ నాగశ్రీ మాట్లాడుతూ. డ్రైవర్ సోదరులు ప్రాణాన్ని పణంగా పెట్టి సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న డ్రైవర్ సోదరులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆర్టీసీ లాభదాయకంగా నడవడానికి చేస్తున్నటువంటి వారి కృషికి ప్రత్యేక డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ లు ఎస్ ఎస్ రావు, శ్రీధర్, మరియు హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, డ్రైవర్లు పాల్గొన్నారు.
