వైకుంఠ ఏకాదశికి “స్థానికకోటా” పెంచాలి
** టీటీడీ పాలకులకు బీజేపీ సీనియర్ నేత నవీన్ విజ్ఞప్తి
తిరుపతి: తిరుమల తిరుపతిలోని స్థానికులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను గతంలో
“లోకల్ ఫెస్టివల్” గా పరిగణించి శ్రీవారిని దర్శించుకోవడం అనవాయితీగా వస్తున్న నేపథ్యంలో ఈసారి వైకుంఠ ఏకాదశికి “స్థానికకోటా” పెంచాలని బీజేపీ సీనియర్ నేత పి.నవీన్ కుమార్ రెడ్డి టీటీడీ పాలకులకు విన్నపం చేశారు. ఈ విషయంపై సోమవారం ఆయన వీవీ మహల్ రోడ్డులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశికి కాలక్రమేనా రద్దీ పెరగడంతో భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ఏకాదశి రోజున…. ద్వాదశి రోజున స్వామి దర్శనాలలో మార్పులు చేర్పులు చేయడం పది రోజులకు పొడిగించడం జరిగిందన్నారు. ఇందులో
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండు రోజులు స్థానికులకు కరెంటు బుకింగ్ ద్వారా లేదా వారం ముందు మహతి ఆడిటోరియంలో… టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో కనీసం 5000 టికెట్లు కేటాయించేలా మిగిలిన రోజులు 2500 చొప్పున 8 రోజులు స్థానికులకు “ఆధార్ కార్డు” ఆధారంగా ఇచ్చేలా టీటీడీ ధర్మకర్తల మండలి, ఉన్నతాధికారులు ఈ నెల 16న జరగబోవు బోర్డు సమావేశంలో సహృదయంతో నిర్ణయం తీసుకోవాలని నగర ప్రజల తరఫున నవీన్ విజ్ఞప్తి చేశారు.
అలాగే స్థానికుల డిమాండ్ మేరకు ఆ కోటాను పెంచాలని నవీన్ విజ్ఞప్తి చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి, ఉన్నతాధికారులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశితో పాటు మొత్తంగా 10 రోజులకు సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించాలన్న లక్ష్యంతో “ఆన్ లైన్”…, “లక్కీడిప్” సిస్టంలో ఎంతో పారదర్శకంగా టికెట్లను విడుదల చేశారని, అయితే కొద్ది నిమిషాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు టికెట్లు పొందారని తెలిపారు. ఈ ఆన్ లైన్ ద్వారా తిరుపతి వాసులకు చాలామందికి టికెట్లు దొరకకపోవడం నిరుత్సాహపరిచిందని… ఎంతో మంది ఆవేదన చెందుతున్నారని వారి ఆవేదనను టీటీడీ ధర్మకర్తల మండలి సహృదయంతో పునః పరిశీలించాలన్నారు.
గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన దుర్ఘటన పునరావృతం కాకుండా అన్నీ శాఖల సమన్వయంతో పటిష్ట చర్యలు తీసుకోవాలని…. రద్దీకి అనుగుణంగా తిరుమలతో పాటు తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు, మంచినీళ్లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను టీటీడీ అనుబంధ వసతి సముదాయాల ప్రాంగణంలో ఏర్పాటు చేయాలన్నారు.
తిరుపతి స్థానికులకు ప్రత్యేక దర్శనం కోటా టిక్కెట్ల ద్వారా శ్రీవారి దర్శన భాగ్యాన్ని పది రోజులు పరిమిత సంఖ్యలో కల్పించాలని నవీన్ విజ్ఞప్తి చేశారు.
