చిలకలూరిపేట నుండి భారతీయ జనతా పార్టీలో భారీ చేరికలు

TEJA NEWS

చిలకలూరిపేట నుండి భారతీయ జనతా పార్టీలో భారీ చేరికలు

వైయస్సార్సీపి పార్టీ వీడి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు శశి కుమార్ సమక్షంలో చేరిన యువ నాయకుడు కోట చంద్ర

భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి రాష్ట్రంలో ప్రజలను ఆకర్షితులను చేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ ముందుకు తీసుకెళుతున్న భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై చిలకలూరిపేట పట్నం నుండి పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరావు సారథ్యంలో యువ నాయకుడు కోట చంద్ర, ప్రముఖ న్యాయవాది బైరా హనుమంతరావు ఇంకా పలువురు పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు యేలూరి శశి కుమార్ వీరిని భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

జిల్లా అధ్యక్షులు శశి కుమార్ మాట్లాడుతూ

పల్నాడు జిల్లాలో భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట వైపు చూస్తూ ఉంది కారణం చిలకలూరిపేటలో మల్లెల శివ నాగేశ్వరావు సారథ్యంలో భారతీయ జనతా పార్టీ,పార్టీ కార్యక్రమాలు చేపట్టడంలో పలనాడు జిల్లాలోనే ముందంజలో ఉందని తెలియజేశారు

పార్టీలో క్రియాశీలకంగా పని చేసేవారు ఎవరైనా భారతీయ జనతా పార్టీలోకి రావచ్చని అలాగే వచ్చిన వారు పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని తెలియజేశారు.

*భారతీయ జనతా పార్టీ, పార్టీలో పనిచేసే ఎవరికి ఏ సమస్య వచ్చినా పార్టీ అండగా ఉంటుందని మరియు మేము కూడా మీకోసం అండగా నిలబడతామని తెలియజేశారు

You cannot copy content of this page

Scroll to Top