5న అమ్మవారి ఆలయంలో తిరుచ్చి ఉత్సవం

TEJA NEWS

5న అమ్మవారి ఆలయంలో తిరుచ్చి ఉత్సవం

** 30న వైకుంఠ ఏకాదశి దర్శనం

తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల్లో ఈనెలలో పలు విశేష ఉత్సవాలు జరగనున్నాయి. వాటి వివరాలు…ఈనెల 5, 12, 19, 26వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి తిరుచ్చి ఉత్సవం జరగనుంది.
22న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6:45 గంటలకు గజవాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. 30న వైకుంఠ ఏకాదశి. 31న వైకుంఠ ద్వాదశి.

శ్రీ బలరామకృష్ణుల ఆలయంలో…

ఈనెల 5న రోహిణి నక్షత్రం – శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామివారి తిరుచ్చి ఉత్సవం. అలాగే శ్రీ సూర్య నారాయణ స్వామి వారి ఆలయంలో 14న హస్తా నక్షత్రం – శ్రీ సూర్య నారాయణ స్వామివారి తిరుచ్చి ఉత్సవం. శ్రీ సుందరాజ స్వామి వారి ఆలయంలోనూ 27న ఉత్తరాభాద్ర నక్షత్రం – శ్రీ సుందర రాజ స్వామివారి తిరుచ్చి ఉత్సవం….శ్రీ శ్రీనివాస స్వామివారి ఆలయంలో 6, 13, 20, 27వ తేదీల్లో శ్రీ శ్రీనివాస స్వామివారి మూలవర్లకు ఉదయం 8 గంటలకు అభిషేకం జరగనుంది.

You cannot copy content of this page

Scroll to Top