ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం రూరల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభోత్సవం.

TEJA NEWS

ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం రూరల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభోత్సవం….

పెద్దపల్లి : ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం రూరల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభోత్సవం జరిగింది.
రామగుండం, కమాన్‌పూర్‌, అంతర్‌గావ్‌, పాలకుర్తి మండలాల నుంచి,
నాలుగు మండలాల్లోని మొత్తం 21 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు క్రీడా పోటీల్లో పాల్గొంటున్నాయి.

గ్రామీణ పాఠశాల విద్యార్థులలో క్రీడాస్ఫూర్తి, శారీరక దృఢత్వం, సమగ్ర వికాసాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం కింద వాలీబాల్, ఖో-ఖో వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రారంభ వేడుకలకు ముకుల్ రాయ్, జనరల్ మేనేజర్ (ఓ&ఎం – తెలంగాణ), బిజోయ్ కుమార్ సిక్దర్, హెచ్‌ఆర్ హెడ్, ప్రవీణ్ కె. చౌదరి, డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్) హాజరైనారు.

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్ జి ఎఫ్ ) అధికారులు,ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ బృందం సభ్యులు, పాల్గొనే పాఠశాలల నుండి ఫిజికల్ డైరెక్టర్లు లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విద్య, క్రీడల ద్వారా సమాజ అభివృద్ధి, యువత సాధికారత పట్ల ఎన్‌టీపీసీ యొక్క నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తూ, విద్యార్థులు, ఉపాధ్యాయుల నుండి ఉత్సాహభరితమైన భాగస్వామ్యాన్ని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించేందుకు రూరల్ స్పోర్ట్స్ మీట్ విలువైన వేదికను అందిస్తుందని భావిస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top