కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

TEJA NEWS

కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి మంత్రి శ్రీధర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి సామాజిక సేవా కార్యక్రమాలతో వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు.

కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ధూళికట్ట సతీష్ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధి, సమాచార సాంకేతిక రంగాల విస్తరణలో మంత్రి శ్రీధర్ బాబు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని , తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ మాట్లాడుతూ, శ్రీధర్ బాబు ప్రజల మనిషిగా, అంకితభావం కలిగిన నాయకుడిగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారని , ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

నగర మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక పురోగతి, ఐటీ రంగ విస్తరణలో శ్రీధర్ బాబు సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షించారు.

అనంతరం నాయకులు మంత్రి శ్రీధర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ప్రజాసేవా ప్రస్థానం మరింత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

You cannot copy content of this page

Scroll to Top