వకుళామాతను దర్శించుకున్న మంత్రి
.
తిరుపతి: రూరల్ మండలం పాతకాల్వ పేరూరు బండపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మాతృమూర్తి శ్రీ వకుళా మాత అమ్మవారి ఆలయాన్ని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. ఆయనతో కలసి “తుడ” చైర్మన్ అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి కూడా వకుళామాతను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ విశిష్టతను మంత్రి అనగాని సత్యప్రసాద్ కు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వివరించారు. దర్శనా నంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ కు, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి,తీర్థ ప్రసాదాలు అందజేశారు.
