అక్కినేని ఆటో హబ్ కార్ గ్యారేజ్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం
దమ్మపేట మండలం మందలపల్లి సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అక్కినేని ఆటో హబ్ (కార్ గ్యారేజ్) సెంటర్ను నిర్వాహకుల ఆహ్వానం మేరకు స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై, వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వయంగా ఉపాధి అవకాశాలను సృష్టించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో వాహనాల సర్వీసింగ్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈ కేంద్రం నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
