ఒలింపిక్ డే సందర్భంగా ఆరోగ్యకర సమాజం కోసం రన్నింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే జారే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం
ఒలింపిక్ డే సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దమ్మపేట మండలంలోని మందలపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాల నుండి ఏపీఆర్ఎస్ పాఠశాల వరకు ప్రత్యేకంగా 2KM రన్ కార్యక్రమాన్ని విజయవంతంగా క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఔత్సాహికులు విద్యార్థులు ఉపాధ్యాయులు క్రీడాకారులు పోలీస్ సిబ్బంది మీడియా ప్రతినిధులు సహా స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ ఒలింపిక్ డే అంటే కేవలం క్రీడలు ఒక్కటే కాదన్నారు. ఆరోగ్యానికి క్రమశిక్షణకు యువత శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు దోహదపడుతుంది అన్నారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
