132/33 కేవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

TEJA NEWS

132/33 కేవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి …..

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ; వేలేరు మండలం పీచర గ్రామ పరిధిలోని 132/33 కేవి సబ్ స్టేషన్ నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత శాఖ అధికారులతో కలిసి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 132/33 కేవి సబ్ స్టేషన్ నిర్మాణం తుది దశకు చేరుకుందని అన్నారు. సబ్ స్టేషన్ నిర్మాణం ఆగస్టు 15నాటికీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 23కోట్ల 76లక్షల వ్యయంతో ఈ సబ్ స్టేషన్ నిర్మాణం ద్వారా వేలేరు, పీచర, నారాయణగిరి, మల్కాపూర్, మల్లికుదర్లతో పాటు కొత్తగా మంజూరు అయిన లింగంపల్లి, కొండాపూర్ సబ్ స్టేషన్లకు మెరుగైన విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు. ఈ సబ్ స్టేషన్ల పరిధిలో ఇక లో ఓల్టేజ్ సమస్య ఉండదని అన్నారు. ఇక్కడే 220/132 కేవి సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టడానికి త్వరలోనే మంజూరు తీసుకువస్తానని వెల్లడించారు. త్వరలోనే 132/33 కేవి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం మరియు 220/132 కేవి సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తో చేయించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత రైతులకు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవకాశం ఉంటుందని, ఇందుకోసం అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టకి తీసుకువెళ్లి 220/132 కేవి సబ్ స్టేషన్ నిర్మాణానికి మంజూరు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అలాగే విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని నారాయణగిరి నుండి వేలేరుకు మార్చే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, తహసీల్దార్, ఎంపీడివో, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top