వర్ధన్నపేటలో రూ.28 కోట్లతో 100 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన ఎమ్మెల్యే నాగరాజు

TEJA NEWS

వర్ధన్నపేటలో రూ.28 కోట్లతో 100 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన ఎమ్మెల్యే నాగరాజు …

వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకునివర్ధన్నపేట టౌన్ పరిధి లోని పల్లె బాట సమీపంలో సుమారు రూ.28 కోట్ల వ్యయంతో 100 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి నేడు భూమిపూజ కార్యక్రమం నిర్వహించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్. నాగరాజు …

ఈ ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంతో వర్ధన్నపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత సమీపంలో అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర చికిత్సలు, ప్రత్యేక వైద్య విభాగాలతో ఈ ఆసుపత్రి ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించనుంది.
ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు…

ఈ కార్యక్రమంలో మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు, టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, టౌన్ అధ్యక్షుడు మైస సురేష్, అనిమిరెడ్డి కృష్ణారెడ్డి తో పాటు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top