వర్ధన్నపేట అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులతో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారదా దేవి..
వర్ధన్నపేట పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. పట్టణంలోని సి.సి. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు.వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సి.సి. రోడ్లు, డ్రైనేజీలు మరియు ఇతర అభివృద్ధి పనులకు మంగళవారం వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారదా దేవి తో కలిసి శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు మాట్లాడుతు:-…
వర్ధన్నపేట పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు అన్ని విధాలా మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తన జీవిత లక్ష్యమని తెలిపారు. పట్టణ పరిధిలో సి.సి. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, విద్యుత్ సదుపాయాలు వంటి ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.15 కోట్ల నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో వినియోగిస్తామని స్పష్టం చేశారు.
చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే, పనుల్లో నిర్లక్ష్యం, అవకతవకలు సహించబోమని హెచ్చరించారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు త్వరగా ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు. వర్ధన్నపేట పట్టణాన్ని శుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దే దిశగా తన వంతు బాధ్యతగా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు…
నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన లక్ష్యమని, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో పార్టీ భేదాలు పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి వర్ధన్నపేటను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ధీమా వ్యక్తం చేశారు…
వార్తలు రాసేముందు మీడియా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజ్ స్పష్టం చేశారు.
మంగళవారం వర్ధన్నపేట పురపాలక సంఘం పరిధిలో రూ.15 కోట్ల నగరాభివృద్ధి నిధులతో చేపట్టనున్న వివిధ మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీపై, రాష్ట్ర ప్రభుత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా నాయకులు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
సోమవారం ఎంఎంఆర్ ఫంక్షన్ హాల్లో మహిళలకు రుణమాఫీ చెక్కులు, సీఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మహిళలు పలు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో జరుగుతున్న అవకతవకలు, వర్ధన్నపేటలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, చెరువులో నీరు లేక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మహిళలు ప్రశ్నించారని చెప్పారు.
ఈ అంశాలను వక్రీకరించి సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవదని అబద్ధపు ప్రచారాలు చేయడం సరికాదని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఉప్పరపల్లి క్రాస్ వద్ద వంద పడకల ఆసుపత్రి నిర్మాణంతో తమకు ఎలాంటి వ్యక్తిగత లాభం లేదని, అక్కడ తమకు రియల్ ఎస్టేట్ భూములు లేవని స్పష్టంగా తెలిపారు. అలాగే ఇసుక వ్యాపారుల నుంచి తాము ఎలాంటి రుసుములు వసూలు చేయడం లేదని, కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
గత 15 ఏళ్లుగా వర్ధన్నపేట నియోజకవర్గంలో చేయలేని అభివృద్ధిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపుతోందన్నారు. గతంలో మూడు టర్ములు ఎమ్మెల్యేగా పనిచేసిన వారు నియోజకవర్గానికి ఏం చేశారో ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని పేర్కొంటూ, కావాలని బ్రాహ్మణ సంఘాలను భూములు పోతాయని రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తండాలను మున్సిపాలిటీ నుంచి వేరుచేసే ప్రక్రియ కొంత ఆలస్యమైందని, ఎన్నికల అనంతరం మంత్రి సీతక్క చొరవతో తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 9 కౌన్సిలర్ స్థానాలను గెలిచి చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పాత–కొత్త విభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు.
సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్పందించకపోతే తానే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు హెచ్చరించారు…
ఈ కార్యక్రమంలో మాజీ టెస్కాబ్ ఛైర్మన్ శ్రీ మార్నెనీ రవీందర్ రావు, టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, టౌన్ అధ్యక్షుడు మైస సురేష్, అనిమిరెడ్డి కృష్ణారెడ్డి తో పాటు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు…
