ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు భాషబోయిన ప్రియాంక నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు …
హన్మకొండ జిల్లా / 65వ డివిజన్ / ఎల్లపూర్…
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్ పరిధిలోని ఎల్లపూర్ గ్రామానికి చెందిన భాషబోయిన ప్రియాంక ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం నుంచి కేటాయించిన రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో తమ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారు. నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని గృహప్రవేశం చేసి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తామని తెలిపారు. పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు…
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల కల నెరవేరుతుందని, ఇలాంటి సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు….
ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పార్టీ అధ్యక్షుడు నేదునూరి సునీల్, డివిజన్ అధ్యక్షుడు అయ్యాల రామిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎరుగొండ శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ఎర్ర ప్రకాష్, శ్రీను తో పాటు డివిజన్, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
