విద్యార్థులు కొత్త నైపుణ్యాలతో భవిష్యత్తును నిర్మించుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

TEJA NEWS

విద్యార్థులు కొత్త నైపుణ్యాలతో భవిష్యత్తును నిర్మించుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సాప్ కోడ్ ఇనోవేషన్ 2025–26 ప్రారంభం

ఘాట్‌కేసర్,

మేడ్చల్ జిల్లా ఘాట్‌కేసర్‌లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన సాప్ కోడ్ ఇనోవేషన్ 2025–26 కార్యక్రమాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన సాప్ కోడ్ ఇనోవేషన్ రూమ్‌ను మంత్రి వివేక్ వెంకటస్వామి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మంచి ఆలోచనతో ఈ విద్యాసంస్థను ప్రారంభించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థాయికి చేరాలంటే శ్రద్ధగా వినడం, క్రమశిక్షణతో చదవడం ఎంతో అవసరమన్నారు.

తన విద్యార్థి దశలో జరిగిన ఒక అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, ఏ పని చేసినా శ్రద్ధతో నేర్చుకోవాలని చెప్పారు. ప్రస్తుతం కొత్త కొత్త సాంకేతికతలు వస్తున్నాయని, వాటిని చూసి భయపడకుండా నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. సాంకేతికతను అవగాహన చేసుకుంటే భయం ఉండదన్నారు.

కార్యక్రమంలో మాట్లాడిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్న సాప్ కోడ్ ఇనోవేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వెంకటస్వామి సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.

అనంతరం వివిధ కళాశాలల నుంచి వచ్చి సాప్ కోడ్ ఇనోవేషన్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు మంత్రి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పావనీ జంగయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మహేష్ గౌడ్, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top