మంత్రి కోమటిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే నాయిని..
పశ్చిమ రోడ్ల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని వినతి..
సానుకూలంగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి..
హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టాలని కోరుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ను హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రహదారి పనులు, నూతన రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు మంత్రికి సమర్పించారు. నియోజకవర్గంలో పలు కాలనీలు మరియు ప్రధాన మార్గాలు దెబ్బతిన్న పరిస్థితిలో ఉన్నాయని, ప్రజలకు రాకపోకలు కష్టతరంగా మారుతున్నాయని ఎమ్మెల్యే వివరించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి తగిన నిధులు విడుదల చేసి సహకరించాలని ఆయన వినతి పత్రం అందజేశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదనలను శ్రద్ధగా పరిశీలించి, సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల విషయాన్ని సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
ఈ సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి , రోడ్లు మరియు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ కూడా పాల్గొన్నారు.
