ఎమ్మెల్యే నాగరాజు ని కలిసిన మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు…

TEJA NEWS

ఎమ్మెల్యే నాగరాజు ని మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు…

వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ నేతావత్ శిబారాణి రాజేందర్, కౌన్సిలర్లు బెజ్జం పాపరావు, నునావత్ కమిలి, మాలోతు దేవేందర్, తీరుపెళ్లి వాణి మరియు ఇతర ముఖ్య నాయకులు నేడు హన్మకొండలోని సుబేదారి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ని మర్యాదపూర్వకంగా కలిశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లను శాలువాలతో సత్కరించి, వారి విజయానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వర్ధన్నపేట అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచిస్తూ తన సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు…

ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపల్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top