సర్పంచ్ గా గెలిపించండి – సేవకునిగా ముందుంటాను : ముదిరెడ్డి లింగారెడ్డి

TEJA NEWS

సర్పంచ్ గా గెలిపించండి – సేవకునిగా ముందుంటాను : ముదిరెడ్డి లింగారెడ్డి

సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముదిరెడ్డి లింగారెడ్డి ఈసారి ప్రజల ఆశీర్వాదంతో గెలిచి గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేయాలనే సంకల్పంతో ముందుకు అడుగేస్తున్నారని మండల రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో పలుమార్లు పోటీ చేసి అతితక్కువ మెజారిటీతో ఓటమి పాలైనప్పటికీ, గ్రామంపై తన సేవాభావం, అభివృద్ధి పట్ల తన కట్టుబాటు మాత్రం ఏమాత్రం తగ్గలేదని లింగారెడ్డి తెలిపారు.

గ్రామ అభివృద్ధికి పెద్ద నాయకుల మాదిరిగా డబ్బులు చల్లటం కాకుండా, నిజాయితీగా పనిచేస్తానని ప్రజల ముందు పెట్టుకున్న నమ్మకానికి కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆశలను నెరవేర్చడానికి, టేకుమట్లను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని ప్రచారంలో బాగంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఓటరినీ హృదయపూర్వకంగా అభ్యర్థించారు. ఈనెల 11వ తేదీన జరగనున్న ఎన్నికల్లో క్రికెట్ బ్యాట్ గుర్తుపై తమ విలువైన ఓటును వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామస్థులను కోరారు. ప్రస్తుత అధికార, ప్రతిపక్ష పార్టీల పెద్దలు వారి స్వంత లాభాలకు ఒకటై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని, నిజాలు తెలుసుకునీ విద్యావంతులు, పెద్దలు దీనిని గమనించాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామంలో తాగునీరు, రహదారులు, పారుదల, శానిటేషన్, పేదల సంక్షేమం వంటి సమస్యలను ప్రాధాన్యంగా తీసుకొని వెంటనే పరిష్కరించే బాధ్యత తనదేనని లింగారెడ్డి హామీ ఇచ్చారు. గ్రామ యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల సాధికారత, వృద్ధులు–వివాహితులకు అవసరమైన ప్రభుత్వ పథకాల సకాల ప్రయోజనాలను అందించే దిశగా కృషి చేస్తానని తెలిపారు.“టేకుమట్లను అభివృద్ధి పథంలో నిలిపేది మీ ఒక్క ఓటే. నేను మీ ఇంటి వాడిని… మీ సమస్యలు నాకు తెలుసు. మాటిచ్చిన విధంగానే సేవ చేస్తాను. ఈసారి ప్రజల నమ్మకం నా బలం కావాలనీ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ముదిరెడ్డి లింగారెడ్డి భావోద్వేగంతో ప్రజలను కోరారు. గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం పని చేసే నాయకుడిని గెలిపిద్దాం…
ఈసారి బ్యాట్ గుర్తు – అభివృద్ధికి గెలుపు!

You cannot copy content of this page

Scroll to Top