డి పోచంపల్లి డబల్ బెడ్ రూమ్ సముదాయ నివాసితులు సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చిన నర్సారెడ్డి భూపతి రెడ్డి.
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం డి పోచంపల్లి డబల్ బెడ్ రూమ్ సముదాయంలో నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడి అసోసియేషన్ సభ్యులు *మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి * దృష్టికి తీసుకురావడం జరిగింది.
ఈ సందర్భంగా డబల్ బెడ్ రూమ్ నివాసితులని ఉద్దేశించి భూపతి రెడ్డి మాట్లాడుతూ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా ఇంచార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు కి తెలియపరిచి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు ముత్యంరెడ్డి, జక్కుల మల్లేష్, రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్ భరత్ గౌడ్, డిపోచంపల్లి డబల్ బెడ్ రూమ్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు సురేష్, జనరల్ సెక్రెటరీ నగేష్ మరియు కమిటీ సభ్యులు, నివాసితులు పాల్గొన్నారు.
