ఆత్మగౌరవ ప్రతీకగా నూతన టీడీపీ ఆఫీస్
** భూమిపూజ పనుల పరిశీలనలో “తుడ” ఛైర్మన్
తిరుపతి: నగర శివార్లలో నూతనంగా నిర్మించ తలపెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యాలయ భూమిపూజ పనులను “తుడ” చైర్మన్ అండ్ టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ నూతన కార్యాలయం నిలవబోతోంది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు… లోకేష్ మార్గదర్శకత్వంలో కార్యకర్తలకు సకల సౌకర్యాలు ఉండేలా ఈ భవనాన్ని తీర్చిదిద్దుతున్నాం.
భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలకు, ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఈ కార్యాలయం కేంద్ర బిందువు కానుంది. అత్యాధునిక వసతులతో, అందరికీ అందుబాటులో ఉండేలా ఈ భవనం రూపుదిద్దుకోనుంది. వేదిక ఏర్పాటు, తాగునీరు, ఇతర మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
