ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు..
కోదాడ పట్టణంలోని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. హుజుర్నగర్ రోడ్ లో సభ్యులందరూ కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ వృత్తిపరమైన ఒత్తిడిని పక్కన పెట్టి, సభ్యులందరి మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించేందుకు ఈ వేడుకలు దోహదపడతాయని పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వర్మ, స్వామి, సురేష్, శ్రీను, లక్ష్మణ్, వనం ప్రభాకర్, వీరన్న, అల్లిక శ్రీను, విష్ణు, హరీష్, ల్యాబ్ వాసు, సైదాచారి, ఆల్బమ్ సైదా, స్వాతి నాని,శ్రావణ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
