చందానగర్ డివిజన్ పరిధిలోని తార నగర్ లో నూతనంగా ఏర్పాటు

TEJA NEWS

చందానగర్ డివిజన్ పరిధిలోని తార నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆకాష్ ఎడ్యుకేషన్ సెంటర్ మరియు CMS కాలేజ్ నూతన బ్రాంచ్ ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తార నగర్ లో ఆకాష్ ఎడ్యుకేషన్ సెంటర్ మరియు CMS కాలేజ్ నూతన బ్రాంచ్ ను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని , ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. ఆకాష్ మరియు CMS విద్య సంస్థలు అగ్రగామిగా ఉన్నాయి అని విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి దోహదపడుతుంది అని , మెడికల్ (నీట్) ,ఇంజనీరింగ్ (JEE) ప్రవేశ పరీక్షాల కోసం పోటీ పడే విద్యార్థులకు ఇక్కడి విద్య బోధన ఎంతగానో ఉపయోగపడుతుంది అని PAC చైర్మన్ గాంధీ తెలిపారు. విద్యార్థులు జీవితంలో గొప్ప గొప్ప లక్ష్యాలు పెట్టుకొని వాటిని సాధించే క్రమంలో సడలని పట్టుదల, మంచి క్రమ శిక్షణ, కఠోర శ్రమ తో పట్టుదల తో అనుకున్న లక్ష్యం చేరుకునేవరకు విశ్రమించకూడదు అని , మంచి చదువులు చదువుకొని బంగారు భవిష్యత్తు కు బాటలు వేసుకోవాలని ,తల్లిదండ్రులకు, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించి, జీవితంలో గొప్ప గా ఎదగాలని కలలను సాకారం చేసుకోవాలని PAC చైర్మన్ విద్యార్థులకు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో ఆకాష్ దక్షిణ ఆపరేషన్ హెడ్ నిశాంత్ వత్సవ, చీఫ్ ఆకాడమిక్ బిజినెస్ హెడ్ అమిత్ కుమార్ ఉరిటీ , CMS కాలేజ్ చైర్మన్ చంద్రశేఖర్ మరియు నాయకులు మారబోయిన రాజు యాదవ్ , నాగరాజు, మల్లేష్ యాదవ్, విష్ణు వర్ధన్ రెడ్డి, శశాంక్, పవన్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top