ఎన్ని దాడులు చేసినా పోరాటాన్ని ఆపేది లేదు

TEJA NEWS

ఎన్ని దాడులు చేసినా పోరాటాన్ని ఆపేది లేదు

కారుపై రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్య
—- బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

వనపర్తి: తాను అనేక సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నానని…దానిని ప్రోత్సహించేవారు అనేకం ఉన్నా.. నచ్చని వారే దాడులను తెగబడతారని, ఇలాంటి దాడులకు భయపడబోనని… సమస్యలపై పోరాటాన్ని ఆపేది లేదని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ స్పష్టం చేశారు.

రాత్రి 12 గంటల సమయంలో తన స్వగ్రామమైన వడ్డెవాటకు వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన కారుపై రాళ్లతో దాడి చేశారని, కారు డ్రైవర్ చాకచక్యంతో కారు ముందుకు వేగంగా పోనివ్వడంతో తృటిలో ప్రాణాపాయం తప్పిందన్నారు.

ఈ విషయమై జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ కి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాడి జరిగిన విషయాన్ని సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వగానే 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకొని తమకు రక్షణ కల్పించి, కంప్లైంట్ ఫైల్ చేయడంతో పాటు ఉదయాన్నే ఘటనా స్థలం వద్ద దర్యాప్తు చేపట్టి, క్లూస్ టీంను పిలిపించి విచారణను వేగవంతం చేశారన్నారు.

ఘటన జరిగిందని తెలిసిన కొద్ది నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకొని తనకు రక్షణగా ఉన్నందున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

అదేవిధంగా దాడి చేసిన వారు ఎవరైనా సరే వారిని వదిలిపెట్టొద్దని చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరారు.

జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన సమస్యలపై 15 ఏళ్లగా తాను పోరాటం చేస్తున్నానని చెప్పారు.

ఉచిత విద్యా, వైద్యంపై, రైతుల సమస్యలపై, ప్రభుత్వ ఆఫీసుల్లో లంచావతారులపై, పర్యావరణానికి హాని కలిగిస్తున్న స్నేహ చికెన్ పరిశ్రమపై, అక్రమ మైనింగ్ తవ్వకాలపై మరియు జిల్లాలో నెలకొన్న అనేక సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నానని చెప్పారు.

ఈ దాడి జరిగినంత మాత్రన తన పోరాటాన్ని ఆపేస్తానని అనుకుంటే అది వారి అవివేకమని మండిపడ్డారు.

ఎన్ని దాడులు చేసినా అదిరేది లేదు, బెదిరేది లేదు.. ప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు.

రాజ్యాంగ బద్ధంగా, ప్రజాస్వామ్య బద్దంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని పోరాటం చేస్తలేమని, నిజాయితీగా కొట్లాడుతున్నామన్నారు.

ఇకనైనా దాడులు చేసే దుండగులు ఎవరరైతే ఉన్నారో వారు ఇలాంటి పిరికిపంద చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు పాండురంగ యాదవ్, వివి గౌడ్, నరసింహ యాదవ్, స్వప్న, దేవర శివ, అంజన్న యాదవ్, మహేందర్ నాయుడు, అరవింద చారి, బత్తుల జితేందర్, ధర్మేంద్ర సాగర్, అస్కని రమేష్, నాగరాజు, చెలిమిల్ల రామన్ గౌడ్, బీసీ కుల సంఘాల జెఎసి నాయకులు రాములు యాదవ్, సత్యం యాదవ్, వెంకటన్న గౌడ్, నజీర్, తిరుపతన్న గౌడ్, కొత్త గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top