ఓం మణికంఠ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం మహిళా అధ్యక్షురాలిగా

TEJA NEWS

ఓం మణికంఠ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం మహిళా అధ్యక్షురాలిగా మైలారం పద్మ నాయీ గారికి నియామక పత్రాన్ని అందజేసిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ..

ఎమ్మెల్యే నివాస కార్యాలయంలో
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఓం మణికంఠ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం మహిళ విభాగ అధ్యక్షురాలిగా శ్రీమతి మైలారం పద్మ నాయీ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ప్రజా నాయకుడు కె.పి.వివేకానంద్ చేతుల మీదుగా ఆమెకు నియామక పత్రం అందజేయబడింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువాతో సత్కరించి సంఘం అభివృద్ధికి మరియు తోటి మహిళల సాధికారత కోసం కృషి చేసి సంఘంలో మరియు సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమాన్ని సంఘం అధ్యక్షులు గడిల వెంకటేశ్వర్లు నాయీ, ప్రధాన కార్యదర్శి వి.ఎస్.ఆర్. వెంకట్ నాయీ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్ జె.రవీందర్ నాయీ, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికృష్ణ నాయీ, కోటి నాయీ, షాపూర్ నగర్ నరేష్ నాయీ, నరేందర్ నాయీ, సిహెచ్. వెంకటేష్ నాయీ మరియు
దుండిగల్ మండలంలోని బోరంపేట నుండి మాజీ ప్రధాన కార్యదర్శి రాజు నాయీ, బోరంపేట శ్రీను నాయీ, స్వామి నాయీ, కార్తీక్ నాయీ, పోచంపల్లి సతీష్ నాయీ, మల్లంపేట్ చింటూ నాయీ, శివకుమార్ నాయీ, దత్తాత్రేయ, మురళి నాయీ సహా సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.

You cannot copy content of this page

Scroll to Top