సంక్షేమ సంఘాల సమిష్టి కృషితోనే కాలనీ అభివృద్ధి సాధ్యం – బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కె.పీ. వివేకానంద్
ఈ రోజు కుత్బుల్లాపూర్‌లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయంలో, 130-సుభాష్ నగర్ డివిజన్ పరిధిలో ఇటీవల ఏర్పాటైన పాండు బస్తీ సంక్షేమ సంఘం సభ్యులు, కార్పొరేటర్ సురేష్ రెడ్డి నేతృత్వంలో, బీఆర్ఎస్ పార్టీ విప్ మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కె.పీ. వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఒక్కొక్కడి కృషికి మించినది సమిష్టి కృషి అని, సంక్షేమ సంఘాల ఐక్యత, సహకారంతోనే కాలనీల్లో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సంఘం సభ్యులు పరస్పర సమన్వయంతో పని చేస్తే అనేక అభివృద్ధి పనులను సులభంగా నెరవేర్చుకోవచ్చని తెలిపారు.
అనంతరం, నూతనంగా ఎన్నికైన సంక్షేమ సంఘం సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో నూతన సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉప్పర మీన్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీపతి సతీష్ కుమార్, కమ్మిలి నాగరాజు, ప్రధాన కార్యదర్శులు తమ్మిశెట్టి వరలక్ష్మి, మనుపడి సుకన్య, శ్రీశైలం యాదవ్, మహేష్, పాలేకర్ సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్లు బేతల రవీందర్, ఎం.డి. షాకీర్, తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు..
