ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం శ్రీవిష్ణు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ భరత్ నగర్ లోని మరియు శ్రీ హరిహర క్షేత్రంలో, మూసాపేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులను అభినందించారు. సౌందర్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అద్యక్షులు తూము వేణు, ఓబిసి వర్కింగ్ చైర్మన్ తూము వినయ్, కూకట్పల్లి ఓబిసి సెల్ చైర్మన్ తూము సంతోష్, శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చైర్మన్ శ్రీహరి పటేల్, తూము కొండల్, మోసిన్ తదితరులు పాల్గొన్నారు.
