కొండవీడు కోట పైన శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం ఏర్పాటుకి ప్రత్తిపాటి పుల్లారావు అంగీకారం..రావు సుబ్రహ్మణ్యం
నవతరం పార్టీ పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం కొండవీడు కోట మీద శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేయాలని, చిలకలూరిపేట పట్టణంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాపు కళ్యాణ మండపాన్ని నిర్మించాలని మాజీమంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు కి నియోజకవర్గ కాపు సామాజిక తరపున విజ్ఞప్తి చేశారు, ప్రత్తిపాటి పుల్లారావు స్పందిస్తూ కొండవీడు కొండపైన శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం తప్పకుండా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ,న్యాయమైన కోరిక అని అన్నారు.వెంకటేశ్వర సినీ స్క్వేర్ హల్ నందు జరిగిన సమావేశంలో నిర్ణయం ప్రకటించారు
మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో 10వ తరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థులకు వెంట మించి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది ఇలానే ప్రతి సంవత్సరం మెడికల్ విద్యార్థులకు ప్రోత్సహిస్తూ మంచి కార్యక్రమాలు చేయాలని కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలందరినీ అభినందించారు.కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం ద్వారా ఎంతమంది విద్యార్థులు చదువుతూ ఉంటే అంత మందికి 13 వేల రూపాయలు తల్లుల ఖాతాలో కూటమిప్రభుత్వం డబ్బులు జమ చేసిందన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు అన్నారు.
శ్రీకృష్ణ దేవరాయ విద్యా అభివృద్ధి కమిటీ,ఆంధ్ర ప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (కాట్వా ) వారు పదో తరగతిలో కాపు మెరిట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు
కాపు, తూర్పు బలిజ, తెలగ, ఒంటరి కాపు, నాయుడు విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా మాజీమంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు
పదవ తరగతిలో 570 పైన మెరిట్ సాధించిన 15 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు, బట్టలతో సత్కరించి నగదు అందజేసి విద్యార్థులను శాలువాలతోటి, పూలదండలతోటి సత్కరించి వారిని అభినందించారు
జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్ జనసేన పార్టీ తరఫున నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి నడిపిస్తామని తెలియజేశారు
ఉయ్యూరు నరసింహారావు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయ విద్యా కమిటీ, కాట్వావారు కాపు మెరిట్ విద్యార్థులకు ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు
యాదాల సుజాత మాట్లాడుతూ మా అబ్బాయి ని ఒక పాఠశాల వారు చేర్చుకోమని అన్నారని, మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సహకారంతో అదే పాఠశాలలో చేర్పించగా ఆ పాఠశాల లో ఫస్ట్ ర్యాంకు సాధించాడు మా బాబు అని తెలియజేశారు
వాగ్దేవి విద్యాసంస్థల అధినేత పదవ తరగతిలో 580 మార్కులు పైన వచ్చిన ఏ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని, విద్యార్థులకు మా విద్యాసంస్థలో ఐఐటి చదువుకోవడానికి ఉచితంగా అవకాశం కల్పిస్తామని తల్లిదండ్రులకు, మాజీమంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారికి తెలియజేశారు.
శ్రీకృష్ణదేవరాయ విద్య అభివృద్ధి కమిటీ చైర్మన్ తోట బ్రహ్మ స్వాములు మాట్లాడుతూ నాకు రాజకీయ గురువు, రాజకీయాల్లో ఈ విధంగా నేను ముందుకు వెళుతున్నాను అంటే కారణం మా పుల్లారావు గారు, అలాగే ఆయన ఎంతోమందికి ఇతర దేశాలకు వెళ్ళటానికి ఆయన సొంత నిధులతో సహాయ సహకారాలు అందించారు, చిలకలూరిపేటలో కాపు సామాజిక వర్గం అభివృద్ధి చెందింది అంటే అది కేవలం ప్రతిపాటికి దక్కుతుందని తెలియజేశారు. 2014- 19 సమయంలో పట్టణంలో దాదాపు 300 మంది కుటుంబాలకు కాపు కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి రెండు లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారన్నారు
ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (కాట్వా) చెన్నకేశవుల రమేష్ బాబు మాట్లాడుతూ ఈ కాట్వా ద్వారా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో మేము పర్యటించాము,అన్ని చోట్ల కాపు కళ్యాణ మండపాలలో సభలు నిర్వహించాము, ఒక్క చిలకలూరిపేటలోనే కాపు కళ్యాణ మండపం లేక వేరే చోట కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము, కావున మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సహకారంతో కాపు సామాజిక కళ్యాణ మండపాన్ని నిర్మించుకొని అందులో కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేశారు, కాట్వా ద్వారా పేద విద్యార్థులకు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, పేద కుటుంబాలకు, ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకు ఇలా ఎన్నో రకాలుగా ఆర్థిక సహాయం చేస్తూ ఈ కాట్వా ముందుకు వెళుతుందని తెలియజేశారు
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సదాశివరావు, కరిముల్లా,మద్దుమాల రవి, అంకీరెడ్డి రమేష్, జనసేన పార్టీ నాయకులు, మునీర్ హసన్, సుభాని, కోటా సాంబ, జనసేన వీర మహిళలు,తెలుగు దేశం పార్టీ మహిళలు, కాపు సామాజిక వర్గానికి చెందిన ,పట్టణ ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
