కొనసాగుతున్న ధనుర్మాస భజనలు

TEJA NEWS

కొనసాగుతున్న ధనుర్మాస భజనలు

తిరుపతి: అతి పవిత్రమైన ధనుర్మాసంలో మహా విష్ణువును స్తుతిస్తూ భజన చేయడం ఎంతో పుణ్యఫలమని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి అన్నారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి పెద్దకాపు వీధిలోని పురాతన శ్రీరామ భజన మందిరంలో స్థానికులు నెల రోజులపాటు భక్తి పాటలతో భజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ భక్తిరస పాటలతో భజన కార్యక్రమాన్ని భక్తి ఫార్వస్యంతో నిర్వహించారు. ఈరోజు చైతన్య అనూష దంపతులు ఉభయ దారులుగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటనారాయణ, ముని కృష్ణయ్య, చిన్నప్ప, గుండాల గోపీనాథ్, కొట్టే సుబ్రహ్మణ్యం, పోలే జనార్దన్ రెడ్డి, మేకల గంగయ్య, మునేంద్ర రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, డాక్టర్ విద్వాన్ కస్పా పద్మనాభం, రామ్ కుమార్, తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విజయ, కల్పన, ధనలక్ష్మి, అరుణ, ధనంజయ రెడ్డి, జీవన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top