ఓర్వలేకే జగన్ అండ్ కో దుస్ప్రచారం

TEJA NEWS

ఓర్వలేకే జగన్ అండ్ కో దుస్ప్రచారం

** టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్

చిత్తూరు:
“సుపరిపాలనలో తొలి అడుగు ” ప్రోగ్రాం కు సూపర్ స్పందన వస్తోందని, తొలి ఏడాదిలోనే ప్రజలకు మేలు చేసే 700 కు పైగా మంచి పనులు చేసి శభాష్ అని అనిపించుకొన్న కూటమి
ప్రభుత్వం పనితీరు చూసి ఓర్వలేకే జగన్ అండ్ కో బ్యాచ్ అబద్ధాలు చెబుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ మండిపడ్డారు. ఆయన చిత్తూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్ అండ్ కో కూటమి ప్రభుత్వం పై విషం కక్కుతూ తప్పుడు ప్రచారాలకు దిగుతున్నా ప్రజలు నమ్మడం లేదన్నారు. జగన్ 5 ఏళ్ళ అరాచక పాలనను అనుభవించిన ప్రజలు ఇక రాష్ట్రంలో జగన్ కు ఎట్టి పరిస్థితి లో కూడా మద్దతు ఇవ్వరని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అయిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కు ప్రజలనుండి అపూర్వ స్పందన లభిస్తున్నదని చెప్పారు.


తెలుగుదేశం పార్టీ
ఎమ్మెల్యేలు, ఇంచార్జీల ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఇంటి ఇంటికి తెలుగుదేశం ప్రజాప్రతినిధులు , నాయకులు వెళ్లి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాల కర పత్రములు ఇస్తూ ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు.
తొలి రోజు ప్రారంభం అయిన అన్ని ప్రాంతాలలో ప్రజలనుండి మంచి స్పందన లభించింది . మహిళలు మంగళహారతులతో స్వాగతించారు .అన్ని వర్గాల ప్రజలు ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అరాచక , ఫేక్ ప్రచారాల పార్టీ అయిన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పై సుపరిపాలన తొలి అడుగుకు వచ్చే ప్రజా స్పందనను ఊహించి దాన్ని డైవర్ట్ చేయడానికి రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అని ఒక దుష్ట ప్రోగ్రాం కు పిలుపు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టో ల గురించి , హామీల గురించి మాట్లాడే అర్హత , నైతిక హక్కు 85 శాతం హామీలను ఉల్లంఘించిన జగన్ మోహన్ రెడ్డికి ఎక్కడ ఉంది ? చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో గురించి మాట్లాడే అర్హత జగన్ కు ఉందా ? అని ప్రశ్నించారు. జగన్ 2019 ఎన్నికల మునుపు నవరత్నాలు, మేనిఫెస్టో హామీలు , పాదయాత్ర లలో హామీలు కలిపి 730 హామీలు ఇచ్చారు. అందులో అమలు చేసినవి కేవలం 21 మాత్రమే అని ఏద్దేవా చేశారు. అమలు చేయని హామీలు 621 ఉన్నాయని ఆరోపించారు.

You cannot copy content of this page

Scroll to Top